ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (10:59 IST)

జగనన్న విద్యా దీవెన : రూ.709 కోట్లు జమ

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకం జగన్న విద్యా దీవెన. ఈ పథకం కింద బుధవారం మరో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. అక్టోబరు - డిసెంబరు 2021 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.10.82 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లుల ఖాతాల్లో రూ.709 కోట్లను జమ చేయనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో ఆయన ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 
 
ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్ని, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్ కోర్సులు చదివే విద్యార్థులకు వారి కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజు మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం అయిన వెంటనే ఈ నిధులను జమ చేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.1778 కోట్లు జగన్ ప్రభుత్వమే చెల్లించడం గమనార్హం. ఇపుడు జగన్ ఒక్క త్రైమాసికానికే రూ.709 కోట్లు చెల్లించనుంది.