మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (10:37 IST)

కమల్ హాసన్ 'విక్రమ్' చిత్రం రిలీజ్ డేట్ ఖరారు

విశ్వనటుడు కమల్ హాసన్ తాజా చిత్రం 'విక్రమ్'. లోకేశ్ కనకరాజ్ దర్శకుడు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం మే నెలలో విడుదల చేస్తారని తొలుత ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ విడుదల తేదీని మార్చారు. జూన్ మూడో తేదీన ఈ చిత్రం విడుదల చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. 
 
ఇందులో కమల్ డిఫరెంట్ లుక్, ఈ సినిమా నుంచి వచ్చిన కాన్సెఫ్ట్ వీడియో ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకిత్తించాయి. ఇందులో కమల్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, నరేన్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు. 'ఖైదీ', 'మాస్టర్' తర్వాత లోకేశ్ కనకరాజ్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.