గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (14:17 IST)

నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు: కమల్

Kejriwal_Kamal
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అరవిందే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) గురువారం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
 
తాజాగా నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయంపై హర్షం వ్యక్తం చేశారు. "ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్‌కు అభినందనలు… పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రమైన పంజాబ్‌లో విజయం సాధించడం అభినందనీయం" అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేశారు. 
 
సినీ దిగ్గజం కమల్ హాసన్ తన సొంత పార్టీ అయిన మక్కల్ నీది మయ్యమ్ పార్టీని ప్రారంభించడానికి ముందు కలుసుకున్న అతి కొద్ది మంది రాజకీయ నాయకులలో అరవింద్ కేజ్రీవాల్ ఒకరు కావడం గమనార్హం.