UP: ఆంటీతో ప్రేమ.. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది.. అంతే గొంతు నులిమి చంపేశాడు..
సోషల్ మీడియా ప్రభావంతో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం అయిన మహిళతో యువకుడు సాగించిన ప్రేమాయణం చివరికి హత్య వరకు దారితీసింది. ఓ 42 ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో ఫిల్టర్లు వాడి తన వయసును దాచిపెట్టి ఓ యువకుడితో ప్రేమాయణం నడిపింది. చివరకు అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 11న ఫరూఖాబాద్ జిల్లాలో గుర్తు తెలియని మహిళ శవం లభ్యమైంది.ఆ మృతదేహం కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.
యూపీలోని మెయిన్‌పురికి చెందిన 26 ఏళ్ల అరుణ్ రాజ్‌పుత్‌కు, ఫరూఖాబాద్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల రాణికి మధ్య ఏడాదిన్నర క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. రాణి నలుగురు పిల్లల తల్లి. అయిన ఫిల్టర్లు ఉపయోగించి తనను తాను చాలా చిన్న వయసు యువతిగా పరిచయం చేసుకుంది. ఆమె ఫోటోలు చూసి అరుణ్ అనే వ్యక్తి ఆమె ప్రేమలో పడ్డాడు. ఆపై వారు తరచుగా హోటళ్లలో కలుసుకునే వారు.
ఈ క్రమంలో రాణి, అరుణ్‌కు సుమారు రూ.1.5 లక్షల వరకు డబ్బులు కూడా ఇచ్చింది. కొంతకాలంగా రాణి తనను పెళ్లి చేసుకోవాలని, ఇచ్చిన డబ్బు తిరిగివ్వాలని అరుణ్‌పై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టింది.
ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆవేశానికి లోనైన నిందితుడు, ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై జరిపిన విచారణలో నిందితుడు తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.