మంగళవారం, 15 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జులై 2022 (15:58 IST)

ఆగస్టు ఒకటి నుంచి టాలీవుడ్‌లో షూటింగులు బంద్

shootings bundh
తెలుగు చిత్రపరిశ్రమలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ సినిమా షూటింగులు ఆగిపోనున్నాయి. ప్రొడ్యూసర్ గిల్డ్ నిర్ణయానికి ఫిల్మ్ చాంబర్ కూడా మద్దతు ప్రకటించింది. 
 
సినీ నిర్మాణంలో అధిక వ్యయం భరించలేకపోతున్నామంటూ గత కొంతకాలంగా నిర్మాతలు వాపోతున్న విషయం తెల్సిందే. దీనికితోడు ఒక కొత్త చిత్రాన్ని విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలకు ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్‌ను వారు తెరపైకి తెచ్చారు. 
 
కాగా, షూటింగుల నిలిపివేతపై నిర్మాత దిల్ రాజు కీలక ప్రకటన చేయగా, ఆయనకు చిన్నాపెద్దా నిర్మాతలంతా ఒక్కతాటిపైకి వచ్చి మద్దతు ప్రకటించారు. అయితే, ఒకటో తేదీ నుంచి ఆగిపోయే షూటింగులను తిరిగి ఎపుడు పునరుద్ధరిస్తారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 
 
దీనిపై 24 క్రాఫ్టులతో మాట్లాడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి షూటింగులు ఆగిపోనున్నాయి. మరోవైపు, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మాత్రం నిర్మాత దిల్ రాజు నిర్ణయాన్ని వ్యతిరేకించింది.