శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 జులై 2022 (14:08 IST)

టాలీవుడ్ నిర్మాత మండలి కీలక నిర్ణయం.. పెద్ద సినిమాలకు బ్రేక్

tollywood industry
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి షూటింగులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. నిజానికి కరోనా లాక్డౌన్ కారణంగా ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చిత్రపరిశ్రమ పలు విధాలుగా కృషి చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ సంక్షోభం నుంచి కోలుకునేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఫిల్మ్ చాంబర్ ప్రత్యేక కమిటీ ప్రమేయం లేకుండా ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 
 
చిత్రపరిశ్రమలో వచ్చిన మార్పులు కారణంగా అనేక మంది నిర్మాతల ఓటీటీల్లో తమ చిత్రాలను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో పెద్ద చిత్రాలకు బ్రేక్‌లు పడనున్నాయి. 
 
టాలీవుడ్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అనేక చిత్రాలు బడా హీరోలవే కావడం గమనార్హం. వీటిలో మెగాస్టార్ చిరంజీవి నటించే "గాడ్‌ఫాదర్" కూడా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ చిత్రం 'లూసీఫర్‌'కు ఇది రీమేక్. 
 
అలాగే, ప్రభాస్ నటించే "సాలార్", "ప్రాజెక్ట్ కె", మారుతి  చిత్రాలకు బ్రేక్ పడనుంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కే "పుష్ప-2", మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో రానున్న కొత్త చిత్రం, పవన్ కళ్యాణ్ నటించే "హరిహర వీరమల్లు", నందమూరి బాలయ్య నటించే "ఎన్బీకే 107", రామ్ చరణ్ - శంకర్ కాంబినేష్‌లో వచ్చే చిత్రం, అఖిల్ అక్కినేని "ఏజెంట్", వంశీ పైడివల్లి - ధనుష్ చిత్రం ఇలా అనేక చిత్రాలపై నిర్మాతలు తీసుకున్న నిర్ణయం తవ్ర ప్రభావం చూపనుంది.