శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (19:45 IST)

బిగ్ బాస్ లేడీ విన్నర్‌ సిల్క్ స్మితకు సూపర్ ఆఫర్

bindu madhavi
తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్‌గా బిందు మాధవి నిలిచి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తమిళనాట ఈమెకు సిల్క్ స్మిత పోలికలున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇక  బిగ్ బాస్ తెలుగు ఓటీటీ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్‌గా ట్రోఫీ‌ని గెలిచుకున్న బిందు మాధవి తెలుగులో బంపర్ ఆఫర్‌ను కొట్టేసింది. 
 
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇంతలోనే మరో సర్‌ప్రైజ్ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. 
 
బిందు మాధవి మలయాళంలో మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ సినిమాలో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
ఇక ప్రణవ్ మోహన్‌లాల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే స్టార్ హీరోల సినిమాలలో నటించే ఛాన్సులు వరిస్తాయని సినీ పండితులు అంటున్నారు.