శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 ఏప్రియల్ 2022 (22:21 IST)

రూ.30లకు లాటరీ కొంటే.. కోటి రూపాయలు తగిలింది...

అదృష్టమంటే అతడిదే. ముప్పై రూపాయలు పెట్టి ఓ లాటరీ టికెట్ కొన్న అతనికి కోటి రూపాయలు తగిలింది. అయితే ముందు ఈ విషయాన్ని అతడు నమ్మలేదు. అంతే నేరుగా లాటరీ టికెట్‌తో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్‌కి చెందిన మహబూబ్ రూ.30 పెట్టి ఓ లాటరీ టికెట్ కొంటే ఏకంగా కోటి రూపాయలు తగలడంతో రాత్రికి రాత్రే అతని లైఫ్ మొత్తం మారిపోయింది. షేర్‌క్రాపర్‌గా పనిచేస్తున్న మహబూబ్‌కి డబ్బులు గెలుచుకోవాలన్నఅసక్తితో లాటరీ టికెట్లు కొనేవాడు. ఈ అలవాటుతో అతను కోటీశ్వరుడు అయ్యాడు.
 
తాను గెలిచిన భారీ మొత్తంతో ఏమి చేయాలనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని మహబూబ్ చెప్పుకొచ్చాడు. అయితే, తన భార్య, ముగ్గురు పిల్లల కోసం ఇల్లు నిర్మించడం.. పిల్లలకు మెరుగైన విద్య అందించాలనుకుంటున్నట్లు చెప్పాడు.