1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 జులై 2022 (12:00 IST)

అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత - ముగ్గురి మృతి

gun shot
అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు తుపాకీ కాల్పుల మోత మోగింది. ఈ దేశంలోని ఇండియానా రాష్ట్రంలోని ఓ షాపింగ్ మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఈ పౌరుడు తన వద్ద ఉన్న తుపాకీతో హంతకుడిని కాల్చి చంపాడు. ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్కు మాల్‌లో జరిగిందని. పోలీసులు తెలిపారు. 
 
కాగా, దుండగుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు గ్రీన్‌పుడ్ డిపార్ట్‌మెంట్ పోలీస్ చీఫ్ జిమ్ ఐసోన్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. అదేసమయంల దుండగుడు నుంచి ఒక గన్‌తో పాటు పలు మ్యాగజైన్లను పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.