శనివారం, 12 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (08:53 IST)

ఫ్రీజర్‌లో తల్లి మృతదేహం వుంచిన కుమార్తె.. ఎందుకో తెలుసా?

fridge
నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. క్షణికావేశం దారుణాలకు దారితీస్తున్నాయి. తాజాగా ఓ మహిళ తన తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మహిళకు ప్రస్తుతం 64ఏళ్లు. ఆమె తల్లికి 93ఏళ్లు కాగా.. ఫిబ్రవరిలో ఆమె మృతి చెందింది. అయితే.. ఆ విషయాన్ని తన కూతురు బయట పెట్టలేదు. ఆమె చనిపోయిన విషయాన్ని దాచి.. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చింది. 
 
కూతురి నిర్వాకం ఏప్రిల్‌లో బయటపడింది. దీంతో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని ఫ్రీజర్‌లో దాచి ఉంచడానికి గల కారణాలపై విచారించారు. ఈ నేపథ్యంలో ఆమె అసలు విషయం బయటపెట్టింది. తన తల్లికి వికలాంగుల పెన్షన్ వస్తుందని.. ఆమె చనిపోయిందనే విషయం బయటకు తెలిస్తే.. పేమెంట్స్ ఆగిపోతాయని చెప్పింది. 
 
ఆ డబ్బులకు ఆశ పడి తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టినట్టు వివరించింది. దీంతో అధికారులు షాకయ్యారు. ఆ మహిళపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అధికారులు.. ఆమెను జైలుకు తరలించారు.