శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జులై 2022 (09:59 IST)

నేను దుర్గాదేవిని.. నా భర్తను వదిలేయండి.. ఠాణాలో చేతబడిన చేసిన మహిళ

bihar woman
ఓ మహిళ ఖాకీలకు ముచ్చెమటలు పోయింది. నా భర్తను వదిలివేయాలంటూ స్టేషన్‌లో హల్చల్ చేసింది. నేను దుర్గాదేవిని అని తక్షణం కస్టడీలో ఉన్న తన భర్తను వదిలిపెట్టాలంటూ డిమాండ్ చేసింది. తాను దుర్గాదేవినని చెబుతూ పోలీసులను నానా తిప్పలు పెట్టింది. స్టేషనులోనే చేతబడికి పాల్పడింది. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. 
 
బీహార్‌లోని జముయీ జిల్లాకు చెందిన మహిళ సంజూదేవి. తాగుడుకు అలవాటుపడ్డ ఆమె భర్త కార్తీక్‌ మాంఝీ పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె ఓ చేతిలో కర్ర, మరో చేతిలో బియ్యం పట్టుకొని పోలీస్‌స్టేషనుకు వెళ్లింది.
 
'నేను దుర్గామాతను.. నా భర్తను కాపాడుకునేందుకు వచ్చా' అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. దీంతో కాసేపు హైవోల్టేజి డ్రామా నడిచింది. అక్కడున్న అందరి తలలపై బియ్యం విసిరింది. ఈ మహిళను లేడీ కానిస్టేబుళ్లు బయటకు తీసుకువెళ్లారు. అరెస్టు చేస్తామని బెదిరించేసరికి అసలు విషయం చెప్పేసిందని పోలీసుస్టేషన్‌ అధికారి జితేంద్రదేవ్‌ దీపక్‌ తెలిపారు.