గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (11:41 IST)

తెలంగాణా కొత్త కరోనా వేరియంట్.. పేరు బీఏ 2.75గా నామకరణం

Covid-19
తెలంగాణా రాష్ట్రంలో కొత్త వైరస్ వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే, మరో పది దేశాల్లో కూడా ఈ తరహా వైరస్ ఉన్నట్టు వారు వెల్లడించారు. ఈ వైరస్‌కు బీఏ 2.75గా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్త డాక్టర్ షే ప్లీషాన్ వెల్లడించారు. ఈ సబ్ వేరియంట్‌ను తెలంగాణాతో పాటు మొత్తం పది రాష్ట్రాల్లో గుర్తించామని ఆయన వెల్లడించరు. ఈ మేరకు టెల్ హాషోమర్‌లోని షెబా మెడికల్ సెంటర్‌లోని సెంట్రల్ వైరాలజీ లాబొరేటరీకి చెందిన షీప్లాన్ ట్వీట్ చేశారు. 
 
కాగా, భారత్‌లో ఈ తరహా సబ్ వేరియంట్ కేసులు జూలై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, వెస్ట్ బెంగాల్‌లో 13, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్‌లో ఒక్కొక్కటి, హర్యానాలో ఆరు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, కర్నాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణాలో రెండు కలిపి మొత్తం 69 కేసులు వెలుగు చూసినట్టు ఆయన వివరించారు. ఇది రాబోయే కరోనా ట్రెండ్‌కు హెచ్చరికలాంటిదని ఆయన తెలిపారు.