మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జులై 2022 (13:42 IST)

నార్త్ సెంట్రల్ రైల్వేలో 1,659 అప్రెంటీస్ ఖాళీ పోస్టులు

Jobs
భారత రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) నార్త్ సెంట్రల్ రైల్వే పరిధిలోని 1659 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఇందుకోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం ఇతర వివరాలను పరిశీలిస్తే, 
 
మొత్తం ఖాళీలు 1,659గా ఉండగా, ఇందులో వెల్డర్, అర్మచ్యుర్ విండర్, మెషనిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెన్స్, వైర్‌మెన్, ప్లంబర్, హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థలు వయసు 2022 ఆగస్టు ఒకటో తేదీ నాటికి 15 నుంచి 24 యేళ్ళ మధ్య ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికయ్యే వారికి రూ.18 వేల నుంచి రూ.56,900 వేతనంగా చెల్లిస్తారు. టెన్త్ లేదా మెట్రిక్యులేషన్, తత్సమాన కోర్సులలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
 
అలాగే, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ను కలిగివుండాలి. దరఖాస్తు రుసుంగా జనరల్ అభ్యర్థులకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులను ఆగస్టు ఒకటో తేదీ లోపు ఆన్‌లైన్‌లో పంపించాల్సివుంటుంది.