1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. 1927 engineer jobs in telangana

ఇంజనీర్‌‌‌‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం

Jobs
ఇంజనీర్‌‌‌‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వివిధ డిపార్ట్‌మెంట్లలోని ఖాళీగా ఉన్న 1,927 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
 
ఇందులో ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌లో‌నే 1,200 వరకు అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. మిగతావి ఆర్‌ అండ్‌ బీ, పబ్లిక్‌ హెల్త్‌, పంచాయతీరాజ్‌, గ్రౌండ్‌వాటర్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నాయి. 
 
రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ఇంజనీర్ల రిక్రూట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారని హైదరాబాద్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశం చెప్పారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఏపీలో కరోనా టెన్షన్: ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలకు పాజిటివ్