1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Do you know why Sharwanand given importance to Dimple Hayati

Dimple, Sharwa: డింపుల్ హయాతికి శర్వానంద్ ఎందుకు పెద్దపీట వేశాడో తెలుసా

Sarva, Anupama, dimple
Sarva, Anupama, dimple
శర్వానంద్ నటించిన 'భోగి' ఈనెల 27న విడుదల కాబోతుంది. ప్రమోషన్లో డింపుల్ హయాతితో చెట్టపట్టాలేసుకుని శర్వా వుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే జరిగిన వేడుకలో డాన్స్ కూడా వేశారు. మ్యూజికల్ డాన్స్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేకంగా ఆమెను పట్టుకుని పొట్టి డ్రెస్‌లతో వున్న డింపుల్‌తో సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు.
 
ఇదిలా వుండగా, ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కూడా వుంది. మెయిన్ హీరోయిన్‌గా రిలీజ్ చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టరే చెప్తుంది. కానీ ఆ తర్వాత ఆమె ఎక్కడా కనిపించలేదు. విశ్వసనీయ సమాచారం మేరకు భోగిలో సెకండ్ హీరోయిన్ అయిన డింపుల్ హయాతి ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటుండటంతో అసలు ఏం జరుగుతోందనే ఆసక్తి మొదలైంది.
 
డింపుల్ హయాతిని మొదట ఓ ప్రత్యేక పాత్ర కోసమే తీసుకున్నారని, ఆ తర్వాత కథలో మార్పులు చేయడంతో ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అనుపమకు మొదట చెప్పిన కథకు, ప్రస్తుతం తెరకెక్కిన కథకు మధ్య మార్పులు జరిగాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
 
అయితే ఈ విషయమై సినిమా విడుదలై ఆదరణ పొందితే బాగానే వుంటుంది. అటూ ఇటూ అయితే భోగీ నిజంగా మంటల సెగలు పుట్టిస్తోందేమో చూడాలి. ఇప్పటికే ఆదర్శకుటుంబంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన పూజిత తనను తీసేశారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Pujita Ponnada : త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు