మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 జులై 2022 (09:32 IST)

ఆవో-దేఖో-సీకో.. దమ్ బిర్యానీ రుచి చూడండి.. వెజ్ బిర్యానీని మర్చిపోకండి..

Biryani
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ఆవో-దేఖో-సీకో అంటూ మోదీకి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాదులో దమ్ బిర్యానీ రుచి చూడండి. శాకాహారుల కోసం వెజ్ బిర్యానీ కూడా వుంటుంది. అడగడం మర్చిపోకండి.. ఇరానీ చాయ్ తాగుతూ ఈ అద్భుతమైన తెలంగాణ గడ్డ నుంచి నూతన ఆలోచనా విధానానికి నాంది పలకండి అంటూ కేటీఆర్ పిలుపు నిచ్చారు. 
 
అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆలోచన చేయండి. కొత్త ఆరంభం వైపు అడుగులు వేయండి.. అందుకే అంటున్నాం.. ఆవో.. దేఖో.. సికో.. అని అంటూ కేటీఆర్ బహిరంగ లేఖలో తెలిపారు. 
 
అలాగే సంక్షేమానికి సరికొత్త అర్ధాన్నిచ్చేలా.. పేదల ముఖాలలో చిరునవ్వే లక్ష్యంగా తెలంగాణలో అమలవుతున్న ఆసరా, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు 450కి పైగా సంక్షేమా పథకాలను స్టడీ చేసి.. మీరు అధికారంలో వున్న రాష్ట్రాల్లో అమలు చేయండని ఆ లేఖలో కేటీఆర్ మోదీని కోరారు.