మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 జూన్ 2022 (10:52 IST)

మీకు వయసు పెరిగిపోయింది.. పాఠాలు ఏమి చెప్పగలరు : మంత్రి బొత్స

botsa
1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉపాధ్యాయ పోస్టులను కేటాయించింది. దీంతో అనే మంది అభ్యర్థులు రిటైర్మెంట్ వయసులో ఉపాధ్యాయులుగా కొలువులో చేరనున్నారు. వీని ఉద్దేశించి ఏపీ విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. 
 
'మీకు వయసు పెరిగి పోయింది.. 45 నుంచి 50 ఏళ్లు దాటి పోయాయి.. మీరు చదువు చెప్పడం మరిచిపోయారు.. ఈ వయసులో పిల్లలకు పాఠాలు ఏమి చెప్పగలరన్నదే నా భయమంతా.. ముఖ్యమంత్రి మీకు ఉద్యోగాలిచ్చారు.. దానికి ఎవరూ అడ్డుపెట్టలేం. మిమ్మల్ని ఏం చేయాలో.. నా బుర్ర పనిచేయడం లేదు..' డీఎస్సీ-1998లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులను ఉద్దేశించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
విజయనగరం జిల్లా గరివిడిలో బుధవారం వైకాపా ఫ్లీనరీ సమావేశం అనంతరం 1998 డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులు కొందరు మంత్రిని కలిసి కృతజ్ఞతలు చెబుతుండగా ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. అందుకే వారికి మళ్లీ శిక్షణ ఇస్తామని మంత్రి బొత్స తెలిపారు.