శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 17 జూన్ 2022 (09:47 IST)

నిరుద్యోగులకు శుభవార్త: సింగరేణిలో 177 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Singareni
సింగరేణి యాజమాన్యం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సింగరేణిలోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సింగరేణి సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా  177 ఎక్స్‌టర్నల్‌ క్లర్కు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. 
 
నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను www.scclmines.comలోని Careers లో అధికారులు అందుబాటులో ఉంచనున్నారు. ఈ జాబ్స్ కు అప్లయ్ చేసుకోవాలంటే కనీస బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు కంప్యూటర్స్‌/ ఐ.టి. ఒక సబెక్టుగా ఉన్నవారు అర్హులు. 
 
ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండి కంప్యూటర్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఆరు నెలల సర్టిఫికేట్‌ కోర్సు ఉండాలి. ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకొనే వారి గరిష్ట వయసు 30 సంవత్సరాలుగా నిర్ణయించారు.
 
ఉద్యోగాలకు రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయనున్నారు. ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఈ నెల 20వ తేదీ నుండి ఆన్‌లైన్‌‌లో స్వీకరిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జులై 10గా నిర్ణయించారు.