సంబంధిత వార్తలు
- నన్ను ఒక్కడు పక్కలో పడుకోమని ఆఫరిచ్చాడు.. హీరోయిన్స్, యాంకర్స్ ?
- సన్నీ లైఫ్ స్టోరీ... యాంకర్ నుంచి నటుడిగా ఇలా ఎదిగాడు..
- భారతదేశంలో డిజిట్ కెరీర్ కౌన్సిలింగ్‌ను విప్లవాత్మక మార్పులను తీసుకువస్తున్న ప్రోటీన్
- అంతర్జాతీయ క్రికెట్‌కు లసిత్ మలింగ బైబై
- నారా లోకేష్‌కు షాకిచ్చిన పోలీసులు : తొలిసారి అరెస్టు
పైలెట్ ఆశయం: ఆటో డ్రైవర్ కుమార్తెకు అండగా నిలిచిన కాంగ్రెస్ ఎంపీ
కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి ఓ ఆటో డ్రైవర్ కుమార్తెకు అండగా నిలిచాడు. పైలెట్ కోర్సు ఖర్చు కోసం తంటాలు పడిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె ఆశయానికి తన వంతు సాయం అందించారు.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాకు చెందిన బోడా అమృతవర్షిణి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ఓ ఆటోడ్రైవర్. కానీ ఆమె పైలట్ కావాలనుకుంది. అందుకు తగినట్లుగానే తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలెట్‌గా అడ్మిషన్ సాధించింది.
ఫీజుల రూపంలో ఖర్చులు చాలా ఉండడంతో అమృతవర్షిణి ఆర్థికసాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సంప్రదించింది. ఆయన ఎంతో ఉదారంగా స్పందించి, ఆమె కోర్సుకు అయ్యే మొత్తం ఖర్చును తాను భరిస్తానని మాటిచ్చారు. ఇందులో భాగంగా రూ.2 లక్షల చెక్‌ను అందించారు.
దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ... ఇలాంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులకు సాయపడేలా తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం తీసుకురాకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఓ ఆటోడ్రైవర్ కుమార్తె పైలెట్ అవడాన్ని గర్వంగా భావిస్తానని తెలిపారు.