శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (10:24 IST)

అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న వారికి ఆర్మీ జాబ్ గోవిందా

agnipath
అగ్నిపథ్ ఆందోళనల్లో పాల్గొన్న వారికి ఇక ఆర్మీలో ఉద్యోగం కథ కంచికే. ఎందుకంటే రైల్వేస్టేషన్‌ విధ్వంస కారకులపై 14 సెక్షన్లు నమోదు చేయడం జరిగింది. అలాగే ఐఆర్‌ఏ 150 సెక్షన్‌ కింద నేరం రుజువైతే యావజ్జీవ లేదా మరణ శిక్ష తప్పదు. ఇప్పటికే 225 మందికి కేసులు నమోదయ్యాయి. 
 
ప్రస్తుతం అగ్నిఫథ్‌ నిరసనలో పాల్గొన్న వారంతా ఆర్మీ ఉద్యోగప్రయత్నంలో సగం ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినవారే. తమ పరీక్షను రద్దు చేశారని ఆవేశంలో చేసిన తప్పిదం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితిలో ఇరుక్కున్నారు. 
 
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ విధ్వంసరచనకు పూనుకున్న వారిపై జీఆర్పీ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో ఇరుక్కుంటే ఆర్మీ ఉద్యోగాలు చేసేందుకు అనర్హులుగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకూ ఇబ్బందులు తప్పవు. 
 
ఈ ఘటనలో నలుగురికి బుల్లెట్‌ గాయాలయ్యాయి. వీరు ఇదివరకటిలా పరుగెత్తడం.. హైజంప్‌, లాంగ్‌జంప్‌ లాంటివి చేయడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. 
 
పైగా రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినందుకు.. వీరిపై మాత్రం ఐపీసీ, భారతీయ రైల్వే చట్టం(ఐఆర్‌ఏ)లోని 14 సెక్షన్లను ప్రయోగించారు. ఐఆర్‌ఏ సెక్షన్లు చాలా కఠినంగా ఉంటాయి. 
 
ఇవి చాలా వరకు నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లే. ఐఆర్‌ఏ 150(హానికరంగా రైలును ధ్వంసం చేయడం) సెక్షన్‌ కింద నేరం రుజువైతే యావజ్జీవ శిక్ష లేదా మరణశిక్షకు గురయ్యే అవకాశముంది