బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (14:56 IST)

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే కన్నుమూత - ప్రకటించిన వైద్యులు

shinzoabe
దుండుగుడు జరిపిన తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజో అబే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా వెల్లడించారు. బుల్లెట్ గాయాలతో కుప్పకూలి అత్యంత విషమ పరిస్థితుల్లో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు అన్ని విధాలుగా చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడిచారు. 
 
ముఖ్యంగా, తుపాకీ కాల్పుల్లో మెడ భాగంలో తగిలిన బుల్లెట్ తీవ్ర రక్తస్రావానికి కారణమైనట్టుగా భావిస్తున్నారు. షింజే అబే ఆస్పత్రిలో చేర్చే సమయానికే అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నారు. ఆస్పత్రిలో రక్తం ఎక్కిచినా ప్రయోజనం లేకపోయింది. కాల్పులు జరిగినపుడే ఆయన మృతి చెందారని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.