శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (21:17 IST)

రాజమౌళి తండ్రికి రాజ్యసభ సీటు - ఇళయరాజాకు కూడా

ilayaraja
రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ కథా రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. 
 
వీరంతా ఆయా రంగాలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది. రాజ్యసభకు ఎంపికైన వారికి ట్విట్టర్​ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. విజయేంద్రప్రసాద్‌ దశాబ్దాలపాటు సృజనాత్మక సేవలు అందించినట్లు మోడీ పేర్కొన్నారు. 
 
"విజయేంద్రప్రసాద్‌ సేవలు మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇళయరాజా సంగీతం అనేక తరాలకు వారధిగా నిలిచింది. ఆయన సంగీతం అనేక భావాలకు ప్రతిబింభం. పి.టి.ఉష జీవితం.. ప్రతి భారతీయుడికి ఆదర్శం. అనేక ఏళ్లుగా ఎందరో క్రీడాకారులను పి.టి.ఉష తయారు చేశారు" అంటూ ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.