మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (09:37 IST)

బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే - కర్నాటక నుంచి నిర్మలమ్మ

Nirmala Sitharaman
రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. మొత్తం 16 రాజ్యసభ స్థానాలకు ఆదివారం అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులోభాగంగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కర్నాటక నుంచి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. అలాగే, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు వెళతారు. కాగా, ఇటీవల ఖాళీ అయిన 54 రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. 
 
బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే,
నిర్మలా సీతారామన్ - కర్ణాటక
జగ్గేష్ - కర్ణాటక
పియూష్ గోయల్ - మహారాష్ట్ర
అనిల్ సుఖ్ దేవ్ రావ్ బోండే - మహారాష్ట్ర
కవితా పాటిదార్ - మధ్యప్రదేశ్
ఘనశ్యామ్ తివారీ - రాజస్థాన్
లక్ష్మీకాంత్ వాజ్‌పేయి - ఉత్తరప్రదేశ్
రాధామోహన్ అగర్వాల్ - ఉత్తరప్రదేశ్
సురేంద్ర సింగ్ నాగర్ - ఉత్తరప్రదేశ్
బాబూరామ్ నిషాద్ - ఉత్తరప్రదేశ్
దర్శనా సింగ్ - ఉత్తరప్రదేశ్
సంగీతా యాదవ్ - ఉత్తరప్రదేశ్
కల్పనా సైనీ - ఉత్తరాఖండ్
సతీష్ చంద్ర దూబే - బీహార్
శంభు శరణ్ పటేల్- బీహార్
క్రిషన్ లాల్ పన్వర్ - హర్యానా