1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS BJP Chief Bandi Sanjay senational comments on Mandir and Mosque

తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాల్సిందే : బండి సంజయ్

bandi sanjay
తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జెట్ స్పీడును ప్రదర్శిస్తున్నారు. అధికార తెరాస పార్టీని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు పెద్ద దుమారాన్ని రేపాయి. తెలంగాణాలోని మసీదులన్నీ తవ్వాలని, ఈ తవ్వకాల్లో శవాలు వస్తే మీవి.. శివలింగాలు వస్తే మావి అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఇప్పటికే ఉత్తరాదికే పరిమైన మందిర్ - మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణాకు తీసుకొచ్చారు. మంగళవారం జరిగిన హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన వివాదాస్పద ప్రసంగం చేశారు. 
 
తెలంగాణాలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని పిలుపునిచ్చారు. ఈ తవ్వకాల్లో శవం కనిపిస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మాత్రం మేము తీసుకుంటామని అన్నారు. 
 
కాగా, ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం బయటపడిన విషయం తెల్సిందే. దీన్ని ప్రధానంగా ప్రస్తావించిన బండి సంజయ్... తెలంగాణాలోని మసీదులను తవ్వినా శివలింగాలు బయటపడతాయన్నారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసివేస్తామని ఆయన ప్రకటించారు. 
About Writer
ఠాగూర్