శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (13:01 IST)

తెలంగాణ వర్శిటీల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీకి పచ్చజెండా

jobs
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,774 పోస్టులను భర్తీ చేయనున్నారు.
 
ఇందులో ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ వంటి అన్ని యూనివర్శిటీల్లోని నాన్ టీచింగ్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల్లో ఒక్క ఉస్మానియా యూనివర్శిటీలోనే 2075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, కాకతీయలో 174, మహాత్మా గాంధీలో 09, తెలంగాణాలో 9, శాతవాహనలో 58, పాలమూరులో 14, పీస్టీయూలో 84, బీఆర్ఏవోయూలో 90, జేఎన్టీయూలో 115, ఆర్జీయూకేటీలో 93, జేఎన్ఏఎఫ్‌యూలో 53 చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 
 
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు నాన్ టెక్నికల్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు, ఆపై విభాగాల్లోని పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీనివాస రావు తెలిపారు.