సంబంధిత వార్తలు
- ఎనభై వసంతాల కె. రాఘవేంద్ర రావు రాసిన ప్రేమలేఖ విశేషాలు
- మద్రాస్ నుండి ప్రేమతో భోజనం తీసుకొచ్చారు - వెంకటేష్
- మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి
- కాలం మారినా జోగిని దూరాచారాలు మారలేదు - రచయిత విజయేంద్ర ప్రసాద్
- జపాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ... 40 గంటల్లో 23 సమావేశాలు..
తెలంగాణాలో నేటితో ఇంటర్ పరీక్షలు పరిసమాప్తం
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నెల ఆరో తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షలకు మొదటి, రెండు సంవత్సరాల్లో కలిసి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా, వచ్చే నెల 20వ తేదీ నాటికి ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఇదిలావుంటే, సోమవారం నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన విషయం తెల్సిందే. ఈ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.
తర్వాతి కథనం
