శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (08:16 IST)

ఇరాన్‌లో కూలిన పదంతస్తుల భవనం : ఐదుగురు దుర్మరణం

building collapse
ఇరాన్ దేశంలో ఘోరం జరిగింది. ఈ దేశంలోని అబాడాన్ నగరంలో పది అంతస్తుల భవనం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. భవన శిథిలాల కింద 80 మందికి వరకు చిక్కుకున్నట్టు సమాచారం. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. 
 
ఈ సహయాక చర్యల్లో రెండు రెస్క్యూ డాగ్‌లు, హెలికాఫ్టర్లు, ఏడు రెస్క్యూ వాహనాలను ఇప్పటికే సంఘటనా స్థలంలో మొహరించినట్టు ఇరాన్ స్టేట్ టీవీ వెల్లడించింది. అయితే, ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై స్థానిక అధికారులు విచారణకు ఆదేశించారు. అలాగే, భవన నిర్మాణ కాంట్రాక్టరును పోలీసులు అరెస్టు చేశారు.