బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 మే 2022 (17:38 IST)

మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు అందుకున్న నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి

Suresh Reddy Kovvuri,  Virendra Sharma
Suresh Reddy Kovvuri, Virendra Sharma
దశాబ్దకాలం స్థాపించిన ప్రఖ్యాత యానిమేషన్ అండ్ గేమింగ్ కళాశాల  'క్రియేటివ్ మెంటార్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ రోజు (మే 22) న యు కె పార్లమెంట్, హౌస్ అఫ్ కామెన్స్, లండన్ లో నిర్వహించిన  యు కె బిజినెస్ మీట్ నుండి ప్రతిష్టాత్మకమైన 'మోస్ట్ ప్రామిసింగ్ క్రియేటివ్ ఎంటర్ ప్రెన్యూర్' అవార్డును అందుకున్నారు.  కన్నుల పండువగా జరిగిన కార్యక్రమం లో క్రీయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ ద్వారా యానిమేషన్ కు చేసిన విశేష కృషికి గుర్తింపుగాను UK పార్లమెంట్ సభ్యుడు శ్రీ వీరేంద్ర శర్మ ఈ అవార్డును శ్రీ సురేష్ కొవ్వూరి కి అందిందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు శ్రీ సల్మాన్ ఖుర్షిడ్, శ్రీ మనోజ్ కుమార్, శ్రీమతి తేజస్వి యాదవ్, శ్రీమతి మహువ మెహతా, శ్రీ సీతారాం ఏచూరి మరియు తెలంగాణ నుండి శ్రీ జయేష్ రంజన్ లతో సహా పలువురు కార్పొరేట్ అధిపతులు పాల్గొన్నారు. 
 
యానిమేషన్ మరియు గేమింగ్ ఇండస్ట్రీ అనేది అభివృద్ది చెందుతున్న పరిశ్రమ ఇది భారతదేశానికి ప్రత్యేకించి AR/VR లతో ప్రత్యేక ముద్ర వేయడానికి అధ్బుతమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంది AR/VR , ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి వినూత్న పరిష్కరాలను అందించడానికి మరియు అగ్రగామిగా ఉండడానికి ప్రపంచ భారతీయ యానిమేషన్ పరిశ్రమ వైపు చూస్తున్నది. ప్రతిష్టాత్మకమైన ఆసియా UK బిజినెస్ మీట్ 2022 నుండి అందుకోవడం అనేది క్రెయేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ చేస్తున్న టువంటి అద్భుతమైన పనిని ప్రదర్శించేందుకు మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందేందుకు అవసరమైనా ప్రోత్సహాన్ని మరియు గుర్తిపును ఇస్తుందని శ్రీ సురేష్ రెడ్డి కొవ్వూరి పేర్కొన్నారు.      
 
క్రియేటివ్ మెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్  2007లో హైద్రాబాద్ నుండి స్థాపించబడింది ఇది విద్యార్థులకు యానిమేషన్ మరియు గేమింగ్ డొమైన్ కు సంబంధించి అత్యుత్త మైన  నాణ్యమైన పరిజ్ఞానాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది.  (BA Hons) (BNC Hons) డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ డిప్లొమా మరియు సర్టిఫికేషన్ ప్రోగ్రములని అందిస్తున్నది ఇన్స్టిట్యూట్. అత్యుత్తమమైన అర్హత కలిగినటువంటి అధ్యాపక బృందం కలిగి ఉంది మరియు విధ్యర్డులకి విశాలమైన తరగతి గదులు, అన్ని వసతులు కలిగిన ల్యాబ్స్ మరియు wifi సదుపాయం కలిగిన క్యాంపస్ తో సహా ఎన్నో ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది.