సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (23:01 IST)

నీలాకాశం ఎర్రగా మారింది.. రక్తపు రంగులో వర్షం పడింది.. ఎక్కడ?

Red Rain
నీలాకాశం ఎర్రగా మారడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇలా నీలాకాశం ఎరుపు రంగులో కనిపించడం మనదేశంలో కాదు. 
 
యూరప్‌లోని ఆయాదేశాల్లో రక్తపు వర్ణంలోకి మారింది నీలాకాశం. వర్షం కూడా రక్తవర్ణంలో కనిపించింది. గతంలో కప్పలు, చేపల వర్షాలు కూడా ఇలానే పడ్డాయి. ఇప్పుడు బ్లడ్‌రెయిన్‌ మిస్టరీ కూడా అలాంటిదేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 
అటు స్పెయిన్‌లోని దక్షిణ ప్రాంతాలు సహా, ఫ్రాన్స్ దేశంపై పరుచుకున్న ఈ ఎర్రటి దూళి మేఘాలు… సెలియా తుఫాన్ ద్వారా సహరా ఎడారిలోని దూళిని తీసుకొచ్చిందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఇప్పటికే బ్రిటన్ వీదుల్లో పార్క్ చేసిన కార్లపై ఎర్రని దూళి పేరుకుపోయింది. బ్రిటన్ దక్షిణ ప్రాంతంలో వానలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది.  
 
మరోవైపు ఈ వీకెండ్‌లోగా బ్రిటన్లో ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలకు చేరుకుంటాయని అంచనా వేసింది అక్కడి వాతావారణ శాఖ. 2021 వేసవిలో బ్రిటన్లో అత్యధిక ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది.