శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 23 మే 2022 (18:06 IST)

మద్రాస్ నుండి ప్రేమ‌తో భోజనం తీసుకొచ్చారు - వెంకటేష్

Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju
Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju
ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమైమౌతున్న ఈ చిత్రం  గురించి వెంక‌టేష్ ఇలా తెలియ‌జేస్తున్నారు. 
 
- మూడేళ్ళ తర్వాత ఎఫ్ 3 రూపంలో నా సినిమా మే 27 థియేటర్ లోకి వస్తుంది. అంతకుముందు చేసిన నారప్ప దృశ్యం ఓటీటీలో విడుదలయ్యాయి. మళ్ళీ ఎఫ్ 3లో మీ అందరినీ థియేటర్ లో కలవడం చాలా ఆనందంగా వుంది. ఎఫ్ 3ని ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన స్క్రిప్ట్ చేశారు. దిల్ రాజు గారితో పని చేయడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు, టెక్నిషియన్ల అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్రంలో నటించిన సినియర్ నటులు అన్నపూర్ణమ్మ గారు, విజయ గారు నాపై ఎంతో ప్రేమతో మద్రాస్ నుండి భోజనం తీసుకొచ్చేవారు. వారు నాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఈ ఈవెంట్ సూపర్ ఎక్స్ ట్రార్డినరీ అదిరిపోయింది. ఎఫ్ 3  కూడా అదిరిపోతుంది. మీరంతా థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
వరుణ్ తేజ్ మాట్లాడుతూ..  ఎఫ్ 3 అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకి, టెక్నికల్ టీం కి థ్యాంక్స్. ఈ సినిమాలో సునీల్ గారితో నా కాంబినేషన్ చాలా చక్కగా వచ్చింది. మళ్ళీ పాత సునీల్ ని చూస్తారు.  దిల్ రాజు, శిరీష్ గారి సినిమా అంటే నా హోం ప్రొడక్షన్ లా ఫీలౌతా. ఫిదా, ఎఫ్ 2 లాంటి సూపర్ హిట్స్ దిల్ రాజు గారి బ్యానర్ లో చేశాను. ఎఫ్ 3తో హ్యాట్రిక్ కోడతామనే నమ్మకం వుంది.  ప్రొడక్షన్ టీం అద్భుతంగా పని చేసింది. దేవిశ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. దర్శకుడు అనిల్ రావిపూడి నా బ్రదర్ , అద్భుతమైన వ్యక్తి. ప్రస్తుత కాలంలో అనిల్ అంత కామెడీ ఎవరూ పండించలేరని నా నమ్మకం. ఎఫ్ 3తో మళ్ళీ అది ప్రూవ్ చేస్తారు. వెంకటేష్ గారితో రెండోసారి చేసే అదృష్టం నాకు దక్కింది. ఆయనతో నా ప్రయాణం మర్చిపోలేను. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది''అన్నారు.
 
అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. ఎఫ్ 3 లాంగ్ జర్నీ, ప్యాండమిక్ ని దాటి వచ్చాం. మీకు వినోదాన్ని పంచాలని, ఎఫ్ 2కి మించి నవ్వించాలని చాలా కష్టపడి పని చేశాం. నా స్క్రిప్ట్ టీం కు చాలా థ్యాంక్స్. నవ్వడం ఈజీ కానీ కామెడీ క్రియేట్ చేయడం అంత తేలిక కాదు. నిర్మాత దిల్ రాజు గారు నాకు ప్రొడ్యుసర్ కంటే ఫ్యామిలీ అని చెప్పాలి. మా కాంబినేషన్ లో సినిమాలు వస్తూనే వుంటాయి, నిర్మాత శిరీష్ గారు నాకు గొప్ప ఎనర్జీ ఇస్తుంటారు.  తమన్నా, మెహరీన్, సోనాల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ , ఇలా సినిమాలో నటించిన నటీనటులు లందరికీ కృతజ్ఞతలు. అందరూ చక్కగా చేశారు. స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డేకి కూడా కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.  వరుణ్ తేజ్ నా బ్రదర్ లాంటి వారు. ఈ సినిమాలో కొత్త వరుణ్ ని చూస్తారు. ఆయన టైమింగ్ అదిరిపోతుంది. వెంకటేష్ గారు నా ఆల్ టైం ఫేవరేట్ హీరో. కామెడీ టైమింగ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటేష్ గారు గ్రేట్ ఇమేజ్ వున్న హీరో, కానీ కామెడీ చేసేటప్పుడు ఇమేజ్ ని పక్కన పెట్టి చేస్తారు. ఇలా చేయాలంటే లోపల చాలా పాజిటివ్ వుండాలి. ఎఫ్ 2కంటే ఎఫ్ 3 లో ఆయన మరింత హిలేరియస్ గా చేశారు. ఈ రెండేళ్ళ లో చాలా ఒత్తిళ్ళు అనుభవించాం, మే 27కి ఏమీ అలోచించకుండా ఎఫ్ 3ఆడుతున్న థియేటర్ లోకి వెళ్లి సరదాగా నవ్వుకోండి... నవ్వుకోండి..  నవ్వుకోండి.. '' అన్నారు  
 
దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 రెండున్నర  గంటల పాటు మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. అనిల్ రావిపూడి ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ గా డిజైన్ చేశారు. వెంకటేష్, వరుణ్ లాంటి గొప్ప నటులు మాకు హీరోలుగా దొరికారు. తమన్నా , మేహారీన్ సోనాల్ , రాజేంద్ర ప్రసాద్ గారు అలీ ,సునీల్ ఇలా చాల మంది మంచి నటులు ఈ సినిమాలో పూర్తి వినోదాన్ని పంచుతారు. ఈ సినిమాలో టెక్నిషిన్లందరు చక్కగా చేశారు. ఎఫ్ 2ని ఎంత చక్కగా ఎంజాయ్ చేశారో దాని కంటే గొప్పగా ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారు. ఎఫ్ 2లో వెంకటేష్ గారు వరుణ్ తేజ్ గారు ఎంత  కెమిస్ట్రీ పండించారో ఎఫ్ 3లో దానికి మించి వుంటుందని ట్రైలర్ చూస్తే మీకు అర్ధమైవుంటుంది.  ఎఫ్ 2లో ఇద్దరు హీరోయిన్ లు వుంటే ఎఫ్ 3కి వచ్చేసరికి నలుగురు అయ్యారు.సెన్సార్ వాళ్ళు ఆల్రెడీ సినిమా చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫుల్ మీల్స్ లా వుంటుందని చెప్పారు.  దేవిశ్రీ ప్రసాద్ తో మాది నాన్ స్టాప్ సక్సెస్ జర్నీ, ఎఫ్ 3కి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరుణ్ తేజ్ ఫిదా,,ఎఫ్ 2.. ఇప్పుడు ఎఫ్ 3తో హ్యాట్రిక్. అలాగే వెంకటేష్ గారితో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్  2. ఎఫ్ 3 హ్యాట్రిక్. అనిల్ రావిపూడితో సుప్రీమ్, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్2, ఎఫ్ 3.. తర్వాత ఆరో సినిమాతో డబుల్ హ్యాట్రిక్. మే 27న ఎఫ్ 3వస్తుంది. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది'' అన్నారు.