గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (10:11 IST)

దావోస్ గడ్డపై అరుదైన ఘటన-కేటీఆర్-జగన్ మీట్.. ఫోటోలు వైరల్

ktr_jagan
ktr_jagan
దావోస్ గడ్డపై అరుదైన ఘటన చోటుచేసుకుంది. దావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తమ రాష్ట్రాలకు పెట్టుబడులు  రావడమే లక్ష్యంగా దావోస్ వెళ్లిన నేతలు ఇలా భేటీ కావడం చర్చనీయాంశమైంది. కాగా దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో జగన్-కేటీఆర్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంక విదేశీ గడ్డపై సీఎం జగన్‌తో కలిసి దిగిన ఫోటోలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. "నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌గారితో గొప్ప సమావేశం జరిగింది" అని రాసుకొచ్చారు కేటీఆర్. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.