శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 మే 2022 (10:56 IST)

తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ మొదలైంది.. బండి సంజయ్

bandi sanjay
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు పార్టీ చీఫ్ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
 
తాజాగా బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జీల సమావేశంలో పాల్గొన్న బండి సంజయ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కేసీఆర్‌కు కొడుకుతో సన్ స్ట్రోక్ స్టార్ట్ అయ్యిందన్నారు. 
 
కేటీఆర్ అహంకారంతో, ఖండకావరంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌ను చూసి తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటుందన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగిసిన తర్వాత అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే అధికారం అని చెబుతున్నాయన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కష్టపడి పనిచేస్తామని చెప్పుకొచ్చారు.