బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మే 2022 (15:28 IST)

రేవంత్ రెడ్డి ఒక బట్టేబాజ్.. ఓ లుచ్ఛా... : మంత్రి మల్లారెడ్డి

malla reddy
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మల్లారెడ్డిని జైల్లో వేస్తామంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. దీనికి మల్లారెడ్డి ఘాటుగానే కౌంటరిచ్చారు. రేవంత్ రెడ్డి ఒక బట్టేబాజ్ అని, లుచ్ఛా అంటూ ధ్వజమెత్తారు. 
 
తనపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లారెడ్డి మంగళవారం ఘాటుగానే స్పందించారు. రేలంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి జీవితం అంతా బ్లాక్ మెయిలింగేనని ధ్వజమెత్తారు. 
 
మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం తనను బ్లాక్ మెయిల్ చేశారని, డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోతే తన కాలేజీలను మూసేయిస్తానని బెదిరించారన ఆరోపించారు. రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిర్ చేసే రోజు సమీపంలోనే ఉందని మంత్రి మల్లారెడ్డి జోస్యం చెప్పారు.