సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 25 మే 2022 (16:43 IST)

తెలంగాణాలోని వరంగల్‌‌లో నూతన స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

bedroom
ఈ కామర్స్‌ ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల కంపెనీ పెప్పర్‌ఫ్రై, తెలంగాణాలోని వరంగల్‌లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో అతిపెద్ద ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారాన్ని సృష్టించాలనే కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 80కు పైగా నగరాలలో 160కు పైగా స్టూడియోలు పెప్పర్‌ ఫ్రైకు ఉన్నాయి. 

 
2014లో తమ మొదటి స్టూడియోను పెప్పర్‌ఫ్రై ప్రారంభించింది. ఈ నూతన స్టూడియోను ఏస్క్వేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ భాగస్వామ్యంతో ప్రారంభించారు. వరంగల్‌లోని  అత్యంత కీలకమైన వాణిజ్య ప్రాంతం టీచర్స్‌ కాలనీ, హనమకొండ వద్ద ఇది 1252 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది వినియోగదారులకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన శ్రేణి ఫర్నిచర్‌, డెకార్‌ తొలి అనుభవాలను అందిస్తుంది.

 
పెప్పర్‌ ఫ్రై వెబ్‌సైట్‌పై అందుబాటులో ఉన్న ఒక లక్ష ఉత్పత్తుల నుంచి ఎంపిక చేసిన వైవిధ్యమైన ఉత్పత్తుల జాబితాను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ స్టూడియోలో కంపెనీ యొక్క ఇంటీరియన్‌ డిజైన్‌ నిపుణులు కూడా ఉండటం వల్ల, ప్రత్యేకమైన డిజైన్‌ సలహాలను సైతం పొందవచ్చు. వరంగల్‌లోని ఈ స్టూడియో వ్యక్తిగతీకరించిన షాపింగ్‌ అనుభవాలను అందించడం లక్ష్యంగా చేసుకుంది. దీనిని తెలంగాణాలోని  వినియోగదారుల వినూత్న అవసరాలను సైతం తీర్చనుంది. 

 
తమ ఓమ్నీఛానెల్‌ నెట్‌వర్క్‌పై రూపొందించిన వినూత్నమైన ఫ్రాంచైజీ మోడల్‌ను 2017లో పెప్పర్‌ ఫ్రై ప్రారంభించింది. ఇది పెప్పర్‌ ఫ్రై యొక్క ఫుల్‌ఫిల్‌మెంట్‌,  అమ్మకం తరువాత సేవలకు మద్దతునందిస్తుంది. దీనితో పాటుగా స్టూడియో డిజైన్‌, ప్రారంభం, ఏర్పాటు, నిర్వహణ మార్గదర్శకత్వం, మార్కెటింగ్‌, ప్రమోషన్స్‌ కూడా చేస్తుంది. పెప్పర్‌ ఫ్రై ఆ ప్రాంతాలలో అత్యుత్తమ స్థానిక వ్యాపారులతో భాగస్వామ్యం చేసుకోవాలని నిర్ణయించుకుంది. హైపర్‌ లోకల్‌  డిమాండ్‌, ధోరణుల పట్ల వీరికి పూర్తి అవగాహన ఉంది. ప్రతి నెలా 8-9 ఫ్రాంచైజీలను పెప్పర్‌ ఫ్రై ప్రారంభించనుంది.

 
పెప్పర్‌ ఫ్రై తమ పెప్పర్‌ ఫ్రై యాక్సలరేటర్‌ కార్యక్రమాన్ని జూన్‌ 2021లో ప్రారంభించింది. దీనిద్వారా పెప్పర్‌ ఫ్రై యొక్క ఆఫ్‌లైన్‌ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నూతన కార్యక్రమంలో అతిపెద్ద వైవిధ్యత ఏమిటంటే, ఫ్రాంచైజీ భాగస్వాములకు కాపెక్స్‌ అవసరం పడటం. అది దాదాపుగా 15లక్షల రూపాయలు ఉంటుంది. ఈ మోడల్‌ను 100% ప్రైస్‌ పారిటీ ఆధారంగా తీర్చిదిద్దారు. దీనివల్ల ప్రొడక్ట్‌ ఇన్వెంటరీ పెట్టుకోవాల్సిన అవసరం భాగస్వామికి ఉండదు. ఇది పరస్పర ప్రయోజనకరమైన వ్యాపార భాగస్వామ్యంగా నిలుస్తుంది.

 
ఈ స్టూడియోప్రారంభం గురించి పెప్పర్‌ ఫ్రై  ఫ్రాంచైజింగ్‌ అండ్‌ అలయెన్సస్‌ బిజినెస్‌ హెడ్‌, అమృత గుప్తా మాట్లాడుతూ, ‘‘ఏ స్క్వేర్‌ ఎంటర్‌ప్రైజస్‌‌తో భాగస్వామ్యం చేసుకుని వరంగల్‌లో మా నూత స్టూడియోను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఓ పెప్పర్‌ఫ్రై ఫ్రాంచైజీ సొంతం చేసుకోవడమన్నది వ్యాపారపరంగా విజయం సాధించడమే. మేము టియర్‌ 1 నగరాలు మరియు భారీ మెట్రోపాలిటిన్‌ నగరాలకు ఆవల కూడా వినియోగదారులను చేరుకోవాలని కోరుకుంటున్నాము. మా ఫ్రాంచైజీ భాగస్వాములలో విజయవంతమైన వ్యాపారవేత్తలు, మహిళా వ్యాపార వేత్తలు, మాజీ ఆర్మీ అధికారులు, మొదటిసారి వ్యాపారస్తులుగా మారిన వారు ఉన్నారు. నేడు భారీ సంఖ్యలోని మా పెప్పర్‌ ఫ్రై వినియోగదారులు ఏఆర్‌, వర్ట్యువల్‌ ప్రొడక్ట్‌ ఇంటరాక్షన్లపై ఆధారపడి ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇల్లు అనే భావనను రేకెత్తించే మా లక్ష్యంతో, మేము మహోన్నతమైన వినియోగదారుల సేవలను స్ధిరంగా అందించడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని అన్నారు.

 
ఏస్క్వేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ యజమాని నాగేందర్‌ పోలమ్‌రాజు మాట్లాడుతూ, ‘‘పెప్పర్‌ ఫ్రైతో మాకు 2020 నుంచి భాగస్వామ్యం ఉంది. మా మొదటి ఫ్రాంచైజీ స్టూడియోను వారితో కలిసి వైజాగ్‌లో ప్రారంభించాము. ఇది పెప్పర్‌ ఫ్రైతో కలిసి ప్రారంభించిన రెండవ ఫ్రాంచైజీ స్టూడియో ఇది. భారతదేశపు సుప్రసిద్ధ గృహ, ఫర్నిచర్‌ మార్కెట్‌ ప్రాంగణంతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. పూర్తి వైవిధ్యమైన ఓమ్నీ ఛానెల్‌ వ్యాపారం పెప్పర్‌ ఫ్రై. అతి పెద్ద ఓమ్నీఛానెల్‌ గృహ, ఫర్నిచర్‌ వ్యాపారం సృష్టించాలనే వారి ప్రయాణంలో చేరడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము’’ అని అన్నారు.