1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (10:18 IST)

2024 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తుకు కృషి చేస్తా: పవన్ కల్యాణ్

pawan kalyan
వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల పొత్తుకు కృషి చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసేందుకు టీడీపీతో పొత్తు కోసం బీజేపీ నాయకత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.
 
వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసును ఓడించేందుకు సిద్ధంగా వున్నానని పునరుద్ఘాటించిన ఆయన.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోదని స్పష్టం చేశారు. 
 
పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరూ ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తు గురించి చర్చ సాగుతోంది. 
 
అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుతో తమకు చేదు అనుభవం ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ నో చెబుతోంది. కానీ ఉన్నట్టుండి పవన్‌తో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ నాయకత్వాన్ని ఒప్పిస్తానని చెప్పారు.
 
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మూడు పార్టీల మధ్య పొత్తు పెట్టుకునేందుకు జనసేన మొగ్గు చూపుతున్నారు.
 
చంద్రబాబు నాయుడు కూడా ఇదే విధమైన ప్రకటన చేసి, కూటమి భాగస్వామ్య పక్షాలకు ఎక్కువ సీట్లు ఇవ్వడానికి తమ పార్టీ కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. 
 
బీజేపీ, టీడీపీలను ఏకతాటిపైకి తెస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడంతో బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. టీడీపీతో పొత్తుకు బీజేపీ మరోసారి అంగీకరిస్తుందా లేక జనసేనతో పొత్తును తెంచుకుంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.