ఏపీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?
ఆంధ్ర-తెలంగాణ విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో పార్టీకి ఊపు తీసుకువచ్చే విధంగా ఏం చేయాలని విషయంపై అధిష్టానం దృష్టి పెట్టింది.
ఈ క్రమంలో ఏపీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికల దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం కనిపించకపోవడం, క్యాడర్ చెల్లాచెదురు కావడం, నాయకత్వ లోపం వంటి అన్ని విషయాల పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టింది.
ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలను మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించే దిశగా చర్యలు చేపట్టింది.