శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (10:52 IST)

నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన

chandrababu naidu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ అధినేత జిల్లా పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లపై పార్టీ జిల్లా నేతలు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పీఏసీ ఛైర్ పర్సన్ పయ్యావుల కేశవ్, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌లు వేర్వేరుగా పరిశీలించారు. 
 
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా నగర శివారులోని తపోవనం సమీపంలో వీవీఆర్ ఫంక్షన్‌ హాలులో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇక్కడ జరిగే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా సొమందేపల్లి మండలంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు.