శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (18:52 IST)

12న అనంతపురం జిల్లాలో పవన్ పర్యటన

pawan kalyan
అనంతపురం జిల్లాలో ఈ నెల 12వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. పార్టీ తరఫున రూ.లక్ష చెక్కులను బాధితుల కుటుంబాలకు అందజేయనున్నారు. 
 
ఈ నెల 12న సత్యసాయి ఎయిర్ పోర్టుకు చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో కొత్త చెరువు చేరుకుంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. పరామర్శ అనంతరం రైతు ముఖాముఖి కార్యక్రమంలో అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని మధుసూదన్ రెడ్డి వెల్లడించారు.