1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (17:33 IST)

కేసీఆర్ ఢిల్లీ టూర్ ఓవర్: ప్రగతి భవన్‌లో భేటీ

kcrao
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనను నేటితో ముగించనున్నారు. ప‌ది రోజుల క్రితం ఢిల్లీ టూర్ వెళ్లిన కేసీఆర్‌.. ప‌ది రోజుల పాటు దేశ రాజ‌ధానిలోనే గ‌డిపారు. 
 
సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాలుపంచుకున్న కేసీఆర్‌.. త‌న ఢిల్లీ టూర్‌ను ముగించుకున్నారు. సోమవారం ఢిల్లీ నుంచి బ‌య‌లుదేరి హైద‌రాబాద్ రానున్నారు.
 
ఇక మంగ‌ళ‌వారం నాడు త‌న మంత్రివ‌ర్గంతో ముఖ్యమంత్రి స‌మావేశం కానున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌ర‌గ‌నున్న ఈ కేబినెట్ భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌పై కీల‌క చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లుగా స‌మాచారం.