1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TS Governor Tamizhisai Sounder Rajan comments on CM KCR

ప్రోటోకాల్ గురించి సీఎస్‌కు తెలియదా.. ఇగో మనిషిని కాదు : గవర్నర్ తమిళిసై

tamizhisai sounderrajan
తాను ఇగోలకు పోయే మనిషిని కాదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. పైగా, ప్రొటోకాల్ గురించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియదా అంటూ ఆమె మండిపడ్డారు. 
 
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె తొలుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి సేవ చేయని వ్యక్తిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎలా నామినేట్ చేయాలని ప్రశ్నించారు. అందుకే ఆ ఫైలును తిరస్కరించి, తన మనోగతానాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజెప్పానని తెలిపారు. 
 
అదేసమయంలో ఒక వ్యక్తినికాకుండా ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, బాధ్యత కలిగిన వ్యక్తినని చెప్పారు. సీఎం లేదా మంత్రులు ఎపుడైనా తనను కలవచ్చన్నారు. తాను సీఎం కేసీఆర్ గురించి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి రాలేదని రాష్ట్రంలోని గిరిజన సమస్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరేందుకు వచ్చినట్టు చెప్పారు. 
తర్వాతి కథనం
హెలికాఫ్టర్‌లో నవజాత ఆడ శిశువును తీసుకొచ్చిన తండ్రి (వీడియో)