పీయూష్ గోయల్‌పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ నోటీసులు.. ఎందుకంటే?
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌పై సభా హక్కుల ఉల్లంఘన నోటిసులు ఇస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన లేఖలో టీఆర్‌ఎస్ ఎంపీలు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు.
ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడుకు, లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాకు లేఖలను అందజేశారు. రూల్ 187 ప్రకారం ఈ నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 1న ప్రశ్నోత్తరాల సమయంలో పారా బాయిల్డ్ రైస్ ఎగుమతిపై మంత్రి పీయూష్ ఇచ్చిన సమాధానం తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు.
వాస్తవానికి విదేశాలకు మిలియన్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను ఎగుమతి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఉందని చెప్పారు.
లోక్‌సభలో కూడా టీఆర్ఎస్ ఎంపీలు కూడా ఇదే అంశాన్ని లేఖలో ప్రస్తావిస్తూ రూల్ 222 కింద స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు.