సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (15:47 IST)

ఇది పవిత్రస్థలం.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడను : చంద్రబాబు

chandrababu
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆశీస్సుల తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ఇద్రకీలాద్రి పవిత్ర పుణ్యస్థలం. ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. ఈ రోజు నేను ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు తీసుకునేందుకు మాత్రమే ఇక్కడకు వచ్చినట్టు చెప్పారు. 
 
అంతేకాకుండా, ప్రజల తరపున రాజీలేని పోరాటం చేయడానికి వీలుగా అవసరమైన శక్తిని ప్రసాదించాలని దుర్గమ్మను కోరేందుకు వచ్చాను. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా ప్రజల సంక్షేమం కోసం పోరాడుతుంది. ప్రపంచంలో తెలుగు వారు ఏ దేశంలో ఉన్నా నన్ను అభిమానిస్తున్నారు. జన్మదినం సందర్భంగా తనకు బర్త్‌డే విషెస్ చెపుతున్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పమే చేస్తానను అని చంద్రబాబు వెల్లడించారు. 
 
రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం తాను చేపట్టిన పోరాటంలో తప్పకుండా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందని తెలిపారు. కాగా, చంద్రబాబు వెంట ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలైన బుద్ధా వెంకన్నతో సహా అనేక మంది నేతలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఏపీలోని జిల్లాల్లో చంద్రబాబు త్వరలోనే పర్యటించనున్నారు. ఇదే అంశంపై పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపనున్నారు.