శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (11:52 IST)

తిక్కారెడ్డిపై దాడి ఘటనపై విచారణ జరిపించండి : డీజీపీకి బాబు లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సవాంగ్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి లేఖ రాశారు. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత తిక్కారెడ్డిపై జరిగిన దాడిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని బాబు తన లేఖలో కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఆయన ఆరోపించారు.
 
డీజీపీకి సవాంగ్‌కు ఆదివారం రాసిన లేఖలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైకాపా వర్గీయులు దాడి చేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా, రాష్ట్రంలో వైకాపా శ్రేణులు చేస్తున్న దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 
కాగా, కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తాజాగా జరిగిన పెద్ద బొంపల్లి జాతరలో పాల్గొన్న తిక్కారెడ్డిపై వైకాపా శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులు చేసుకోగా, పలువురికి గాయాలయ్యాయి. ఇందులో తిక్కారెడ్డి తలకు బలమైన దెబ్బతగిలింది.