మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 ఏప్రియల్ 2022 (14:02 IST)

మా డాడీనే నా సూపర్ స్టార్ : నారా లోకేష్

Nara Lokesh
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే, తన తండ్రికు పుట్టిన శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. తన తండ్రే తనకు సూపర్ స్టార్ అంటూ వ్యాఖ్యానించారు. 
 
"జన్మినిచ్చేవారే కాకుండా చదువు చెప్పేవారు, అన్నంపెట్టేవారు, భయాన్ని పోగెట్టేవారు కూడా తండ్రితో సమానం అని చాణక్యుడు అన్నారు. ఆ ప్రకారంగా చూస్తే ఆయన (చంద్రబాబు) దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్న చదవులు చదవగలిగారు. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాదిమందికి అన్నదాత అయ్యారు. 
 
ఇక తెలుగువారికి ఆయనంటే భరోసా. లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోటలాది మందికి తండ్రి అయ్యారు. సొంత కుటుంబ కోసం కాకుండా తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్. ఆయనే మా నాన్న చంద్రబాబుగారు. నాన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు" అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.