మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జూన్ 2022 (13:12 IST)

పెద్దల సభకు 41 మంది ఏకగ్రీవంగా ఎంపిక

rajya sabha
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిలో అత్యధికంగా 14 మంది బీజేపీ తరపున ఎన్నికయ్యారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు, వైకాపా నుంచి నలుగురు, తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ అన్నాడీఎంకేల నుంచి ఐదుగురు సభ్యులు ఉన్నారు. 
 
రాజ్యసభలో మొత్తం 57 ఖాళీలు ఏర్పడగా ఈ స్థానాల భర్తీ కేసం జూన్ 10వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్ల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆ తర్వాత 41 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఆయా రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 16 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఇందులో మహారాష్ట్రలో ఆరు సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే, రాజస్థాన్ రాష్ట్రంలో నాలుగు, కర్నాటలో 4, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు, ఏపీకి చెందిన వైకాపాకు రాజ్యసభలో సభ్యుల సంఖ్య 9కి చేరింది.