సంబంధిత వార్తలు
- డైనమిక్ సిటీ హైదరాబాదులో అడుగుపెట్టా: ప్రధానమంత్రి మోదీ ట్వీట్
- ద్రౌపది ముర్ముపై ఆర్జీవీ కామెంట్స్.. ఆపై వివరణ.. ఏమన్నారంటే..?
- కేటీఆర్‌ను టాలీవుడ్ ఎత్తుకుపోతుందేమో.. మీరు ఆడుకోవడానికి నేనే దొరికానా?
- శివలింగ పుష్పంతో పూజ.. ఫలితాలు.. అష్టైశ్వర్యాలు ఖాయం
- అనుపమ పరమేశ్వరన్ ట్వీట్.. చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ఆవులు
ఈ ఫోటోను చూసి మీరు ఏమంటారు? నా డాక్యుమెంటరీలో లేదు.. లీలా మణిమేగలై
Lord Shiva-Parvati
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి చెందిన లీనా మణిమేగలై.. 'రిథమ్స్ ఆఫ్ కెనడా'లో భాగంగా 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలోని ఉన్న అగాఖాన్ మ్యూజియంలో విడుదల చేశారు.
అయితే, ఆ పోస్టర్ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.
ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అటు కెనడాలోని భారత హైకమిషన్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది.
దీంతో స్పందించిన అగాఖాన్ మ్యూజియం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శన నుంచి తొలగించింది. అటు ట్విటర్ కూడా లీనా పోస్టర్‌ను తొలగించింది.
"జానపద రంగస్థల కళాకారులు తమ ప్రదర్శనలను ఎలా పోస్ట్ చేస్తారో బిజెపి పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమా నుంచి వచ్చినది కాదు. ఈ సంఘ్ పరివార్లు తమ అలుపెరగని ద్వేషం మరియు మతపరమైన మతోన్మాదంతో నాశనం చేయాలని కోరుకునే రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఇది. హిందుత్వ ఎప్పటికీ భారతదేశం కాజాలదు." అంటూ ఆమె పేర్కొన్నారు.
