మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (09:26 IST)

అనుపమ పరమేశ్వరన్ ట్వీట్.. చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, ఆవులు

Anupama Parameswaran
మలయాళీ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చెత్తాచెదారంతో పాటు ప్లాస్టిక్ కవర్లున్న గల్లీలు, అక్కడే ఉన్న ఆవులు కలిగిన కొన్ని పిక్స్‌ను అనుపమ నెట్టింట షేర్ చేసింది. ఈ ఫొటోలతో పాటు గుడ్ మార్నింగ్ అనే క్యాప్షన్‌ను కూడా జోడించింది. 
 
అయితే అనుపమ చేసిన ఈ పోస్ట్ కు జీహెచ్ఎంసీ రిప్లై ఇచ్చింది. మీరు షేర్ చేసిన ఫొటోలు ఏ ప్రాంతానికి చెందినవో చెప్పండి.. మా టీం వచ్చి ఆ సమస్యను పరిష్కరిస్తారు అంటూ ఇచ్చిన రియాక్షన్‌కు నెటినజన్లు పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
Anupama Tweet
Anupama Tweet
 
అంతే కాదు.. అనుపమ ఈ ఫొటోస్‌కు గుడ్ మార్నింగ్ అని చేర్చడంపైనా కొందరు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆ క్యాప్షన్‌కి, ఆ ఫొటోస్ సంబంధం ఏంటని కొందరంటుంటే.. మరికొందరు ఆవులను సంరక్షించాలనే సందేశాన్నీ తెలుపుతున్నారు.

Anupama Tweet
Anupama Tweet


ఈ ఫోటోను కొందరు షేర్ చేసి అనుపమ ఆల్ రెడీ లొకేషన్ షేర్ చేసింది ఆఫీసర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.