గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (10:42 IST)

ప్రయాణికులకు శుభవార్త - నిజామాబాద్ టు తిరుమల డైరెక్ట్ సర్వీస్

tsrtc bus
తెలంగాణ రవాణా సంస్థ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ముఖ్యంగా, నిజామాబాద్ నుంచి తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఇది నిజంగానే శుభవార్త. ఈ రెండు ప్రాంతాల మధ్య శుక్రవారం నుంచి డైరెక్ట్ బస్సు సర్వీసుని ప్రారంభించింది. ఈ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు బస్సు టిక్కెట్‌తో పాటు రూ.300 శీఘ్ర దర్శన టోకెన్‌కు అందజేస్తారు. నిజామాబాద్ నుంచి తిరుపతికి ఒక బస్సు, తిరుపతి నుంచి తిరుమలకు మరో బస్సులో తీసుకెళతారు. 
 
తిరుమలలో ఉదయం 10 గంటలకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. అయితే, ఈ బస్సులో ప్రయాణించాలంటే కనీసం వారం రోజుల ముందుగా తమ టిక్కెట్లను www.tsrtconline.in అనే వెబ్‌సైట్‌లో రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ నెల ఒకటో తేదీ నుంచి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ తరహా ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించిన విషయం తెల్సిందే.