ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (16:02 IST)

హైదరాబాద్‌ కేంద్రంగా చైల్డ్ పోర్న్‌గ్రఫీ - గుట్టురట్టుచేసిన సైబర్ టిప్‌లైన్

hyderabad police
హైదరాబాద్ కేంద్రంగా చైల్డ్ పోర్న్‌గ్రపీ తంతు జరుగుతున్నట్టు సైబర్ టిప్‌లైన్ విభాగం పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో చైల్డ్ పోర్న్‌గ్రఫీ వీడియోలను అప్‌లోడ్ చేసినట్టు కనుగొన్నరు. ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 
 
గత కొన్నేళ్లుగా చైల్డ్ పోర్న్‌గ్రఫీ వీడియోపై‌ హైదరాబాద్ నగర సైబర్ టిప్‌లైన్ విభాగం దృష్టిసారించింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో చిన్నారుల అశ్లీల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నట్టు గుర్తించారు. ఇందులోభాగంగా మూడు ఐపీ అడ్రెస్‌ల ద్వారా వీటిని అప్‌లోడ్ చేసినట్టు పసిగట్టారు. 
 
సైబర్ టిప్ లైప్ లైన్ ఈ వివరాలను సీఐడీకి అందించడంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఐడీకి అందించిన వివరాల ఆధారంగా ఐపీ అడ్రస్‌ల ద్వారా నేరస్థులను గుర్తించారు. రసూల్ పురా, టోలిచోకి, వారాసి గూడ ప్రాంతాల నుంచి వీడియోస్‌ను అప్‌లోడ్ చేసినట్టు అధికారులు కనిపెట్టి వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.