సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జూన్ 2022 (16:33 IST)

జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచార నిందితుల గుర్తింపు

victim
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మేజర్ అయిన సాదుద్దీన్ అనే నిందితుడు చంచల్‌గూడ జైలు ఉండగా, మిగిలిన ఐదుగురు మైనర్లు కావడంతో వీరిని ప్రభుత్వం జువైనల్ హోంలో ఉంచారు. 
 
ఈ క్రమంలో ఈ అత్యాచార కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు సోమవారం చేపట్టారు. ఆ సమయంలో తనపై లైంగికదాడికి చేసిన ఆరుగురు నిందితులను బాధితురాలు గుర్తించింది. 
 
తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులకు, న్యాయమూర్తులకు తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన అనేక ప్రశ్నలకు బాధితురాలు సమాధానాలు కూడా ఇచ్చింది. ఈ వివవరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేయగా, వీటిని కోర్టుకు సమర్పించనున్నారు.